క్రిస్పీ రన్ టైమ్ తో `బంగార్రాజు`!
on Dec 13, 2021

2022 సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న చిత్రాల్లో `బంగార్రాజు` ఒకటి. కింగ్ నాగార్జున, ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. 2016 పొంగల్ సెన్సేషన్ `సోగ్గాడే చిన్ని నాయనా` ఫ్రాంచైజీలో రెండో సినిమాగా వస్తున్న `బంగార్రాజు`.. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ డుమ్మా!
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి క్రిస్పీ రన్ టైమ్ ని లాక్ చేశారట. 2 గంటల 15 నిమిషాల నిడివి ఉండేలా సినిమాని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `సోగ్గాడే చిన్ని నాయనా` కూడా క్రిస్పీ రన్ టైమ్ తోనే రిలీజైంది. 145 నిమిషాల (2 గంటల 25 నిమిషాల) డ్యూరేషన్ తో `సోగ్గాడే..` సాగగా.. అంతకంటే 10 నిమిషాలు తక్కువగా `బంగార్రాజు` సందడి చేయనుందన్నమాట. మరి.. ఈ క్రిస్పీ రన్ టైమ్ `బంగార్రాజు`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, `బంగార్రాజు`లో నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్యకి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి దర్శనమివ్వనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ బాణీలు అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



