'అఖండ' ఇచ్చిన ఊపుని 'పుష్ప' కంటిన్యూ చేస్తుంది
on Dec 12, 2021

"ఏందబ్బా ఎట్టా ఉండారు.. చానా దినాలయింది మిమ్మల్ని ఇట్టా కలిసి.. బాగుండారా.. ఏందబ్బా ఏంది ఈ రచ్చ.. ఆపొద్దు.. తగ్గేదేలే" అంటూ పుష్ప రాజ్ భాషలో మాట్లాడి ఫ్యాన్స్ లో జోష్ నింపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ పుష్పరాజ్ భాషతో అలరించారు. అలాగే, పుష్పలోని సాంగ్స్ పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. ఒక్కో సాంగ్ ని మీకంటే రెట్టింపు ఎంజాయ్ చేశాను అన్నారు బన్నీ. అంతేకాదు, 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి', 'ఊ అంటావా మావ' ఇలా పుష్ప లోని అన్ని సాంగ్స్ ఒక్కో లైన్ పాడి అలరించారు. ఫంక్షన్ కి కూడా రాకుండా ఈ సినిమా కోసం దేవి కష్టపడుతున్నాడని బన్నీ ప్రశంసించారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాయి. ఈ ఒక్క సినిమా.. నాలుగు సినిమాల కష్టంతో సమానమని బన్నీ అన్నారు.
"రష్మిక.. నేషనల్ క్రష్.. ముద్దుగా నేను క్రష్మిక అని పిలుస్తుంటాను. చాలామందితో వర్క్ చేస్తాం.. కానీ కొందరే మనస్సుకి నచ్చుతారు. నిజంగా నా మనసుకి నచ్చిన అమ్మాయి రష్మిక. వెరీ స్వీట్, వెరీ సింపుల్, వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్. రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది." అంటూ రష్మికపై ప్రశంసలు కురిపించారు బన్నీ.
"ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ తో పాటు, మా మామయ్యల చేత 'ముత్తంశెట్టి మీడియా' అని ఒక బ్యానర్ పెట్టించి సినిమా చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మావయ్యలు నా మీద చాలా ప్రేమ చూపించారు. ఇప్పుడు పుష్ప ద్వారా నాకు ప్రేమ చూపించుకోవడానికి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది." అని బన్నీ అన్నారు.
"సుకుమార్ గారు ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావట్లేదని తెలియగానే నమ్మలేకపోయాను. రమ్మని ఫోన్ చేస్తే ఒక్క పది నిమిషాల్లో నన్ను కన్విన్స్ చేశారు రావట్లేదని. డార్లింగ్ నువ్వెళ్లు, జనాలకి కాన్ఫిడెంట్ గా చెప్పు.. బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి లాస్ట్ అవర్ వరకు పని చేస్తున్నాం. తగ్గేదేలే ప్రొడక్ట్ ఇచ్చే విషయంలో అని చెప్పారు. ఇలా లాస్ట్ అవర్ వరకు పనిచేస్తున్న సుక్కుకి, దేవికి థాంక్స్." చెప్పారు బన్నీ.
"ఇటీవల సక్సెస్ సాధించిన అఖండ మూవీ టీమ్ కి శుభాకాంక్షలు. చాలారోజుల తరువాత తెలుగు సినిమాకి అఖండ ఊపు ఇచ్చింది. ఈ ఊపుని పుష్ప కంటిన్యూ చేస్తుంది. శ్యామ్ సింగ రాయ్, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్, ఆచార్య ఇలా అన్ని సినిమాలకు అల్ ది బెస్ట్. పుష్ప సినిమా మాత్రమే కాదు అన్ని సినిమాలు గెలవాలి" అంటూ అందరి హీరోల సినిమాలకు అల్ ది బెస్ట్ చెప్పారు బన్నీ. ఇక చివరిలో 'ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ డైలాగ్ తో స్పీచ్ ముగించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



