చిరంజీవి 152లో 'మహర్షి' జోడి?
on Feb 27, 2020
చిరంజీవి 152వ సినిమా షూటింగ్ మాంచి స్పీడు మీద వుంది. మెగాస్టార్ మీద తీయాల్సిన సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చకచకా తీస్తున్నారు. మే నెలలోపు మెగాస్టార్ సీన్స్ కంప్లీట్ చేస్తే... తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మీద తీయాల్సిన సీన్లు చేసుకోవచ్చనేది ఆయన ఆలోచన. చిరంజీవి మావోయిస్టుగా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుది స్టూడెంట్ లీడర్ రోల్. ఆయన సరసన ఒక హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. నిజానికి, సినిమాలో మహేష్ ది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అలాగని, గెస్ట్ రోల్ కూడా కాదు. ఆల్మోస్ట్ 25 మినిట్స్ టు 30 మినిట్స్ ఉంటుంది. హీరోయిన్ లెంగ్త్ కొంచెం తక్కువ ఉంటుంది. అయినా సరే ఆ రోల్ కి స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పూజా హెగ్డే పేరు వినపడుతోంది. 'మహర్షి'లో మహేష్, పూజ జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుందని టాక్ వచ్చింది. అందుకని, ఆమెను తీసుకుంటే బావుంటుందని చిరంజీవి 152 టీమ్ ఆలోచిస్తోందట. ప్రస్తుతం ప్రభాస్20 సినిమా షూటింగు కోసమని పూజా హెగ్డే హైదరాబాద్ లో ఉన్నారు. ఆమెను కలిసి కొరటాల కథ వివరించారని టాక్.