తెలుగులోనే తేల్చుకుంటా..
on May 29, 2016
కోలీవుడ్ యంగ్‌హీరో విశాల్ తమిళంలో మాస్ హీరోగా దుమ్ములేపుతున్నాడు. తమిళంలో ఆయన చేసిన చిత్రాలను అక్కడికే పరిమితం చేయకుండా తెలుగులోనూ డబ్ చేసి మార్కెట్ పెంచుకుంటున్నాడు. అలా పెందెంకోడి, పొగరు, వాడు-వీడు, జయసూర్య, రాయుడు ఇలా ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే ఇక డబ్బింగ్ సినిమాల ద్వారా కాకుండా స్ట్రయిట్‌గా తెలుగులోనే సినిమా చేయాలనుకుంటున్నాడు విశాల్. ఈ మేరకు సన్నాహలు సైతం చేస్తున్నాడు. రాయుడు సినిమాను తెలుగులో విడుదల చేసిన హరి నిర్మాతగా సురాజ్ దర్శకత్వంలో విశాల్ స్ట్రయిట్ తెలుగు మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో విశాల్ పక్కన మిల్కీ బ్యూటీ తమన్నా ఆడిపాడనున్నారు. అలాగే విలన్‌గా టర్న్ అయిన అలనాటి హీరో జగపతిబాబు, విశాల్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. జూన్ 9న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది.