ఆ సినిమాలో వేసినవి సెట్స్ అని ఎవరికీ తెలియదు!
on Dec 16, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం సత్యజిత్ రే సినిమాలు కూడా చూడాల్సి వచ్చిందని, అయినా ఉపయోగం లేకుండా పోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also read: సమంత సాంగ్ కాంట్రవర్సీపై రెస్పాండ్ అయిన అల్లు అర్జున్!
"శ్యామ్ సింగ రాయ్ లో రెండు కథలుంటాయి. ఒకటి ప్రజెంట్ జరుగుతుంది. ఇంకోటి 70వ దశకంలో బెంగాల్‌లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. కోల్‌కతా కల్చర్ ఇండియాలో ఎక్కడా కనిపించదు. అక్కడి ఆర్కిటెక్చర్, టెంపుల్స్ అన్నింటిపై రీసెర్చ్ చేశాం. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకుని ఆ సెట్ వేశాను. ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. కానీ అవన్ని బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉన్నాయి. దాని వల్ల అంతగా ఉపయోగం ఏమీ లేదు." అని అన్నారు.
Also read: 'శ్యామ్ సింగ రాయ్', 'ఆర్ఆర్ఆర్' ఉన్నా తగ్గేదేలే!
"ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద సెట్ టెంపుల్ సెట్. అందులో మేజర్ సీన్స్ తెరకెక్కించారు. ఆరు ఎకరాల్లో వేసిన ఆ సెట్ కోసం మూడు నెలల పాటు, రోజూ మూడొందల మంది శ్రమించారు. అన్ని సెట్స్ హైద్రాబాద్‌లోనే వేశాం. ట్రైలర్‌లో ఓ ప్రింటింగ్ ప్రెస్ కనిపిస్తుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. అప్పుడు వాడిన పేపర్, టెక్స్ట్ ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న వాటిని తెలుసుకుని, కొన్నింటిని రీక్రియేట్ చేశాం." అని తెలిపారు.
Also read: ఇంచు కూడా భయం లేదు
"కొన్ని సార్లు ఆర్ట్ వర్క్‌కు గుర్తింపు వస్తుంది. కొన్ని సార్లు రాదు. 'జెర్సీ' సినిమాకు పేరు వచ్చింది. కానీ ఆర్ట్ డైరెక్షన్‌కు పేరు రాలేదు. అందులో వేసినవి సెట్స్ అని ఎవరికీ తెలియదు. నెక్ట్స్ నాని గారి దసరా సినిమా చేస్తున్నాను. రవితేజ గారితో టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాన్ని చేస్తున్నాను. సెట్స్ వర్క్ ఆల్రెడీ మొదలయ్యాయి." అని అవినాష్ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



