'మా' అధ్యక్షుడు నరేష్ పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కంప్లైంట్...
on Jan 28, 2020
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యుల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుతున్నాయి. తాజాగా 'మా' అధ్యక్షుడు నరేష్ పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మా' సంస్థ అభివృద్ధికి నరేష్ అడ్డంకిగా మారారని నిధుల దుర్వినియోగంతో పాటు సభ్యులను అవమానపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. నరేష్ లోపాలను ఎత్తి చూపుతూ క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్ పై చర్యలు తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు.
క్రమ శిక్షాణా సంఘానికి రాసిన లేఖలో మొత్తం పదిహేను మంది సభ్యులు ఈ లేఖపై సంతకం చేశారు. పదకొండు నెలలుగా 'మా' లో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయటువంటి విషయాలన్నిటిపై సవివరంగా ఒక లేఖ రాశారు. క్రమశిక్షణా కమిటీలో చిరంజీవి, మురళీ మోహన్, కృష్ణంరాజు, మోహన్ బాబు, జయసుధ ఐదుగురు సభ్యులుగా ఉన్నారు.
అదేవిధంగా గతంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివాజీ రాజా విషయంలో ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిగా ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించడం పట్ల జీవిత రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నికల కంటే ముందు మహేశ్ బాబుని తీసుకువచ్చి ఫండ్ రైజింగ్ కొరకు చాలా రకాల ఆక్టివిటీస్ 'మా' తరపున నరేష్ హామీ ఇచ్చి.. ఆ తర్వాత పదకొండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఏ కార్యక్రమం చేపట్టకపోవడంపై కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.