హవ్వ.. స్కూలు పిల్లాడితో నయన లిప్‌లాక్
on Aug 12, 2016
లిప్ లాక్కులకు నయనతార పెట్టింది పేరు. తెలుగునాట పద్ధతిగానే కనిపించింది గానీ.. శింబుతో ఓ సినిమాలో రెచ్చిపోయి లిప్ లాక్‌లు ఇచ్చింది. అప్పట్లో వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు కాబట్టి.. ఆ సన్నివేశాలన్ని సహజంగా పండాయి. ఇప్పుడు కూడా నయన లిప్ లాక్ చేసింది. అదేం కొత్త విషయం కాకపోయినా, ఈసారి లిప్ లాక్ ఇచ్చింది హీరోకి కాదు. స్కూల్ పిల్లాడికి. అదే విచిత్రం. ఇప్పుడు ఆ విచిత్రమే వివాదాలకు దారి తీస్తోంది. నయనతార నటించిన తాజా చిత్రం తిరునాళ్ ఈ మధ్యే విడుదలైంది. సినిమా ఫ్లాప్. కానీ అందులో ఓ సీన్ మాత్రం చర్చకు దారి తీస్తోంది.
నయనకు ఓ స్కూల్ పిల్లాడు పెదవిపై ముద్దిచ్చే సీన్ అది. మరీ చిన్న పిల్లాడి చేత అక్కడ ముద్దు పెట్టించుకోవడం ఏమిటి? పిల్లలకు ఏం చెప్పాలనుకొంటున్నారు? అంటూ అక్కడ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆ సన్నివేశాన్ని తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఆ వివాదం.. ఈ చిత్రానికి సరికొత్త పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఆ ముద్దేంటి చెప్మా..?? అనుకొని ఆ సీన్ చూడ్డానికి మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్తున్నారట జనాలు. ఇంకేముంది..?? ఈ వివాదం బాగా నలిగే వరకూ చిత్రబృందం ఎదురుచూస్తుంది. ఆ తరవాత.. ఆ సీన్ ఎడిట్ చేస్తుంది. ఈలోగా రావల్సినంత పబ్లిసిటీ ఫ్రీగా వచ్చేస్తుంది కదా?