హీరోని విలన్‌ని చేసిన కృష్ణవంశీ
on Aug 12, 2016
కృష్ణవంశీ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. మనసులో ఓ పాత్రని ఊహించుకొన్నారంటే .. తెరపై దానికి ప్రాణం పోసేంత వరకూ నిద్ర పట్టదు. అందుకోసం అహర్నిశలూ కష్టపడుతుంటారు. ఆ పాత్రలో కనిపించడానికి నటీనటులు కూడా ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడతారు. అందరి నమ్మకం ఒక్కటే...'కృష్ణవంశీ మంచి సినిమా తీస్తాడులే' అని. కృష్ణవంశీపై నమ్మకంతోనే సాయిధరమ్ తేజ్ నక్షత్రం సినిమాలో అతిథి పాత్ర చేయడానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు మరో యువ హీరో కూడా సై అన్నాడు. కృష్ణవంశీ - సందీప్ కిషన్‌ల సినిమా నక్షత్రంలో తనీష్ కూడా నటిస్తున్నాడట.
బాల నటడుడిగా సుపరిచితుడైన తనీష్ ఆ తరవాత నచ్చావులే, రైడ్ సినిమాలతో ఆకట్టుకొన్నాడు. గత కొంతకాలంగా తనీష్‌కి సినిమాల్లేవు. ఇప్పుడు కృష్ణవంశీ నుంచి పిలుపు వచ్చింది. నక్షత్రంలో తనీష్‌కి ప్రతినాయకుడి పాత్ర దక్కింది. లవర్ బోయ్, చాక్లెట్ బోయ్ ఇమేజ్‌లకు సరిపడే తనీష్ ని కృష్ణవంశీ విలన్ గా ఊహించుకొన్నాడంటే.. ఏదో విశేషం ఉండే ఉంటుంది. అయినా ఈ మధ్య విలన్ పాత్రలకు గిరాకీ బాగా ఏర్పడింది. తనీష్ ఈ సినిమాలో క్లిక్కయ్యితే తెలుగు తెరకు కొత్త విలన్ వచ్చినట్టే.
Also Read