అనుపమకి మరోసారి పొంగల్ ప్లస్సయ్యేనా!
on Jan 3, 2022

`అ ఆ`, `ప్రేమమ్`, `శతమానం భవతి` చిత్రాలతో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్. ఆపై `ఉన్నది ఒక్కటే జిందగీ`, `కృష్ణార్జున యుద్ధం`, `తేజ్ ఐ లవ్ యు`, `హలో గురూ ప్రేమ కోసమే`, `రాక్షసుడు` చిత్రాల్లో నటించిన అనుపమ.. దాదాపు రెండున్నరేళ్ళ తరువాత మరో తెలుగు చిత్రంతో పలకరించబోతోంది. ఆ చిత్రమే.. `రౌడీ బాయ్స్`. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా నటించిన ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న కావ్య పాత్రలో ఎంటర్టైన్ చేయనుంది మిస్ పరమేశ్వరన్.
Also read:మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్స్ లిస్ట్ లో సమంత.. ఎన్నో స్థానమంటే?
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అనుపమ కెరీర్ లో ఇప్పటివరకు పొంగల్ సీజన్ లో ఒకే ఒకసారి సందడి చేసింది. ఆ చిత్రమే.. `శతమానం భవతి`. 2017 ముగ్గుల పండక్కి మురిపించిన ఈ చిత్రంతోనే.. సోలో హీరోయిన్ గా ఫస్ట్ బ్లాక్ బస్టర్ చూసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. మరి.. ఐదేళ్ళ తరువాత పొంగల్ టైమ్ లో రాబోతున్న అనుపమకి.. `రౌడీ బాయ్స్` మరోసారి ప్లస్సవుతుందేమో చూడాలి. కొసమెరుపు ఏమిటంటే.. `రౌడీ బాయ్స్`లాగే `శతమానం భవతి`ని నిర్మించింది కూడా `దిల్` రాజునే కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



