దెయ్యంపైనే ఆ భామ ఆశలన్నీ ఉన్నాయి..!
on May 17, 2016
లావణ్య త్రిపాఠి అవ్వడానికి ఉత్తరాఖండ్ అమ్మాయి అయినా, తెలుగు సినిమాల్లో వరస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి హిట్ సినిమాలతో లక్కీ లెగ్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈ భామ ఇప్పటి వరకూ కోలీవుడ్ లో మాత్రం తన మార్క్ వేయలేకపోయింది. బ్రహ్మ సినిమాతో హీరోయిన్ గా కోలీవుడ్ లో ఎంటరైనా, ఆ సినిమా ఫెయిల్ అవడంతో అక్కడ మళ్లీ అడుగు పెట్టలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్పీడ్ గానే ఉన్న ఈ భామ మరో సినిమాతో కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సారి దెయ్యం సినిమాతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతోందీ అందాల రాక్షసి. సందీప్ కిషన్ హీరోగా నిర్మాత సివి కుమార్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న మాయన్ అనే హర్రర్ సినిమాలో హీరోయిన్ అవకాశం లావణ్యకు దక్కింది. ఈ సినిమాతోనైనా తమిళులను ఒప్పించి, అక్కడా అవకాశాలు దక్కించుకోవాలని భావిస్తోంది లావణ్య. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీలీజ్ చేయనున్నారని సమాచారం.