బ్రహ్మోత్సవంలో మహేష్ వంద మార్చాడట..!
on May 17, 2016
టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవద్దు. కరెస్టే. మహేష్ వంద మార్చాడట. వంద మార్చడమంటే అదేదో చిల్లర అనుకునేరు..కాదు కాదు..విషయంలోకి వెళ్తే, భారీ కాస్టింగ్ తో, అతి భారీ సెట్లతో, మరింత భారీ రిలీజ్ గా వస్తున్న మహేష్ బ్రహ్మోత్సవం సినిమాకు హీరో సూపర్ స్టార్ డ్రస్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా..ఇప్పటికే ట్రైలర్లు చూస్తుంటే మహేష్ లో ఏదో ప్రత్యేకత కనిపిస్తోందిగా..అద్గదేమరి..అక్కడే ఉంది లొసుగు. ఆ హ్యాండ్ సమ్ నెస్ లో సమ్ పార్ట్ సూపర్ స్టార్ వేసిన డ్రస్సులకు కూడా ఉందట. క్లియర్ గా చెప్పాలంటే, మహేష్ బ్రహ్మోత్సవం సినిమా కోసం వంద కాస్ట్యూమ్స్ వాడాడు. సీన్ కు తగ్గట్టుగా డల్, బ్రైట్ కలర్స్ మారుస్తూ స్టైలిస్టులు డిజైన్ చేసిన డ్రస్సులను వేశాడట మహేష్. అందుకే ట్రైలర్స్ లో మహేష్ ముఖం వంద క్యాండిల్ బల్బ్ లా బ్రైట్ గా కనిపిస్తోంది. ఆఫ్ కోర్స్, ఆయన అందగాడనుకోండి..మొత్తమ్మీద ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కలిసి సూపర్ స్టార్ ను పాతికేళ్ల కుర్రాడిలా మనకు చూపించబోతున్నాయన్నమాట. ఇంతకూ సినిమాలో మహేష్ కు రంగుల బిజినెస్ ఉంటుంది అంటూ ఒక ఇంట్రస్టింగ్ టాక్ కూడా నడుస్తోంది. చూద్దాం...శ్రీకాంత్ అడ్డాల, మహేష్ కలిసి బ్రహ్మోత్సవాన్ని ఎంత గ్రాండ్ గా చేస్తారో...!