వివాదాల్లో క్రికెటర్ అజారుద్దీన్ సినిమా..!
on May 17, 2016
భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కెరీర్ అంతా వివాదాల చుట్టూనే తిరిగింది. ఆయన బయోపిక్ గా తెరకెక్కిన అజార్ సినిమా కూడా వివాదాల్లోనే నలుగుతోంది. ఇమ్రాన్ హష్మి టైటిల్ రోల్ పోషిస్తూ తెరకెక్కిన ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది అవాక్కయ్యారట. ముఖ్యంగా బయట అజార్ కు సన్నిహితంగా ఉన్న వాళ్లలో చాలా మంది సినిమాలో తమ పాత్రల్ని మరీ దారుణంగా చిత్రీకరించారని ఫీలౌతున్నారట. అందరిలోకీ ఎక్కువగా బయటికొచ్చిన పేరు రవిశాస్త్రిదే. సినిమాలో ఆయన పాత్రను గౌతం గులాటి పోషించాడు. రవి స్త్రీలోలుడిగా, సొంత భార్యనే మోసం చేసి వేరే అమ్మాయితో గడిపినట్టు చూపించడం రవిశాస్త్రిని చాలా హర్ట్ చేసిందట. తన కుటుంబసభ్యులతో ఈ సినిమా చూసిన రవిశాస్త్రి సినిమాపై మండిపడుతున్నారు. ఇప్పటికే బిసిసిఐకు కూడా రవి ఫిర్యాదు చేశారట. రవిశాస్త్రితో పాటు మరో ఆటగాడు మనోజ్ ప్రభాకర్, అజహర్ మాజీ భార్య సంగీత బిజ్లానీలు కూడా తమ తమ పాత్రను చూపించిన విధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మే 13 న రిలీజైన అజార్ ప్రస్తుతం యావరేజ్ టాక్ తో నడుస్తోంది.