ట్రెండింగ్ స్టార్‌పై లావణ్య పోలీస్ కంప్లైంట్
on Mar 17, 2020
పెళ్లి చేసుకున్నానని తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ సునిశిత్ అనే వ్యక్తిపై హీరోయిన్ లావణ్యా త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదులో శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు. సునిశిత్ పలు యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లావణ్యపై పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇటీవలి కాలంలో అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.
లావణ్య ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. యూట్యూబ్ చానెల్స్ లో సునిశిత్ చేసిన వాక్యాలను పరిశీలించామనీ, ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదనీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ తెలిపారు. సునిశిత్ ఇతర సెలబ్రిటీలపైన కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేశారనీ, ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేస దర్యాప్తు చేస్తున్నామనీ ఆయన తెలిపారు.
పబ్లిసిటీ కోసమో, మరే ఇతర ప్రయోజనం కోసమో తెలీదు కానీ ఇటీవల సునిశిత్ సినీ సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్లు, ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ప్రముఖ హీరోలు తన సినిమాలను లాగేసుకున్నారని, యాంకర్ ప్రదీప్ ఓ అమ్మాయిని మోసం చేశాడని, తాను.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నామని వాగాడు. అంతేకాదు తమది సీక్రెట్ లవ్ మ్యారేజ్ అనీ, 2015లోనే పెళ్లి అయిపోయిందనీ చెప్పాడు. పెళ్లి సమయంలో లావణ్య పేరెంట్స్ తనను చూడగానే పెళ్లికి ఒప్పకున్నారనీ, తన ఇంట్లో మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదనీ కూడా అతను చెప్పాడు. ఇప్పుడు ఇతడి వ్యవహారాన్ని పోలీసులు చూసుకోనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
