సోషల్ లైఫ్‌ను శాక్రిఫైస్ చేయండి: మహేశ్ పిలుపు
on Mar 17, 2020
సామాజికంగా దూరాన్ని పాటించాల్సిన సమయం వచ్చిందనీ, ప్రజాక్షేమం కోసం అందరూ సోషల్ లైఫ్‌ను త్యాగం చెయ్యాలనీ సూపర్ స్టార్ మహేశ్ పిలుపు నిచ్చారు. కరోన్ వైరస్ నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆయన తెలియజేశారు.
ఇది సామాజిక దూరాన్ని పాటించాల్సిన సమయం. ఇలా చెప్పడం కఠినంగా ఉన్నా, ఇది ఇప్పటి అవసరం. ప్రజాక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, మన సోషల్ లైఫ్‌ను శాక్రిఫైస్ చేయాల్సిన సమయం ఇది. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉంటూ, ఈ దశను ఎక్కువగా మీ కుటుంబసభ్యులతో, మీకు ఇష్టమైన వాళ్లతో గడపండి. దీనివల్ల వైరస్ వ్యాప్తిచెందకుండా చాలామంది జీవితాలు రక్షింపబడతాయి. తరచూ మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. మీ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచండి. సాధ్యమైనంత వరకు హ్యాండ్ శానిటైజర్స్‌ను వాడండి. మీలో రోగ లక్షణాలు కనిపిస్తున్నాయనుకుంటేనే మాస్క్‌లు ధరించండి. అవసరమైన ఈ సూచనలనన్నింటినీ పాటించండి. సమష్టిగా కోవిడ్ 19ను ఓడిద్దాం అని మహేశ్ పోస్ట్ చేశాడు.
వరుసగా ఒకరి తర్వాత ఒకరు సినీ సెలబ్రిటీలు కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ వంతుగా ప్రచారం నిర్వహిస్తూ రావడం హర్షించదగ్గ పరిణామం.
మహేశ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
