Home

»

Latest News

వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి వ‌దంతులు.. ఫొటోతో ఆన్స‌ర్ ఇచ్చిన లావ‌ణ్య‌!

Jan 20, 2022 2:39PM

 

లావ‌ణ్యా త్రిపాఠి వార్త‌ల్లో వ్య‌క్తిగా మారింది. మీడియాలోని ఓ వ‌ర్గం లావ‌ణ్య పెళ్లి చేసుకోబోతున్న‌దంటూ ప్ర‌చారం ప్రారంభించింది. అదీ మెగా హీరో వ‌రుణ్ తేజ్ తోటేన‌నేది ఆ ప్ర‌చార సారాంశం. అంతేనా.. బుధ‌వారం బ‌ర్త్‌డే జ‌రుపుకున్న వ‌రుణ్ హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరువెళ్లి ఆమెకు డైమండ్ రింగ్‌ను కానుక‌గా ఇచ్చాడ‌ని కూడా రూమ‌ర్స్ సృష్టించారు. ఇవి లావ‌ణ్య దృష్టికి వ‌చ్చాయేమో.. ఆ రూమ‌ర్స్‌కు చెక్ పెట్టాల‌ని తాన‌స‌లు బెంగ‌ళూరులోనే లేన‌నీ, డెహ్రాడూన్‌లో ఉన్నాన‌ని తెలియ‌జేసే ఓ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫొటోకు ‘Dehardun, India’ అనే క్యాప్ష‌న్ కూడా పెట్టింది. లావ‌ణ్య స్వ‌స్థ‌లం డెహ్రాడూన్ అనే విష‌యం గ‌మ‌నించాలి. 

Also read: ఇన్‌స్టాలో భ‌ర్త‌ను అన్‌ఫాలో అయిన శ్రీ‌జ‌.. ఆ ఇద్ద‌రూ విడిపోతున్న‌ట్లే!

అయితే వ‌రుణ్‌తేజ్‌తో త‌న పెళ్లంటూ ఇంట‌ర్నెట్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చిన వ‌దంతుల‌ను కొట్టివేయ‌డం కానీ, వాటికి క్లారిఫికేష‌న్ ఇవ్వ‌డం కానీ ఆమె చేయ‌లేదు. బ‌హుశా ఆ రూమ‌ర్స్‌కు రియాక్ట్ అయితే వ‌రుణ్‌తేజ్‌తో త‌న అనుబంధం ప్ర‌చారానికి మ‌రింత ఊత‌మిచ్చిన‌ట్లు అవుతుంద‌ని ఆమె అనుకుందేమో తెలీదు. ఒక‌వేళ వారు త‌మ రిలేష‌న్‌షిప్‌ను పెళ్లిగా మార్చుకోవాల‌నుకుంటే, దాన్ని అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌వ‌చ్చు. అప్ప‌టిదాకా వారి బంధం అనేది ఒక వ‌దంతిగానే ఉండిపోతుంది.

Also read: అసిన్, అనుప‌మ బాట‌లో కృతి శెట్టి!

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య క‌లిసి 'మిస్ట‌ర్‌', 'అంత‌రిక్షం' సినిమాల్లో జంట‌గా న‌టించారు. అంత‌రిక్షం టైమ్‌లోనే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం బ‌ల‌ప‌డింద‌నీ, వారు ప్రేమ‌లో ఉన్నార‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. పైగా వ‌రుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలోనూ లావ‌ణ్య మెరిసింది. దీంతో వారి ప్రేమ వ్య‌వ‌హారానికి మ‌రింత ఆజ్యం పోసిన‌ట్ల‌యింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com