నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి
on Jan 20, 2022

నటుడు కొంచాడ శ్రీనివాస్ అనారోగ్యంతో బుధవారం (జనవరి 19) మృతి చెందారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నివాసం ఉంటున్న ఆయన స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం, ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు పైనుంచి కిందపడిపోవడంతో ఛాతీపై దెబ్బ తగిలింది. ఆ తర్వాత జరిపిన పరీక్షలో ఆయనకు గుండె సమస్య ఉందనే విషయం వెల్లడైంది.
ప్రతి సంవత్సరం సంక్రాంతికి తన స్వస్థలం కాశీబుగ్గకు వెళ్లి పండగను సందడిగా జరుపుకోవడం శ్రీనివాస్‌కు ఉన్న అలవాటు. ఈసారీ అలా వెళ్లి కుటుంబంతో సరదాగా గడిపిన ఆయన ఆకస్మికంగా అనారోగ్యానికి గురవడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. కానీ పరిస్థితి విషమించి బుధవారం మరణించారు.
Also read: 103 కేంద్రాలలో 'అఖండ' యాభై రోజుల జైత్రయాత్ర!
శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తమ్ముడు పదేళ్ల కిందట మరణించగా, తండ్రి ఐదేళ్ల కిందట మరణించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు అత్తారిళ్లలో ఉన్నారు.
Also read: ఇన్‌స్టాలో భర్తను అన్‌ఫాలో అయిన శ్రీజ.. ఆ ఇద్దరూ విడిపోతున్నట్లే!
శ్రీనివాస్ పలు సినిమాల్లో, కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించారు. పెద్ద పెద్ద కళ్లతో చూడ్డానికి భయపడేట్లు కనిపిస్తుంటారు శ్రీను. అందువల్ల 'ఆ ఇంట్లో' లాంటి హారర్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. వాటితో పాటు 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'ఆది', 'ప్రేమకావాలి' లాంటి సినిమాల్లోనూ ఆయన నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



