నా హీరోని ఇన్నాళ్లకు కలిశాను!
on Sep 19, 2017
కుష్బూకు ఇప్పుడు 46 ఏళ్లట. ఇది ఆవిడ లెక్కేలేండి. ‘కలియుగ పాండవులు’ వచ్చి 31 ఏళ్లయ్యింది. అంటే.. ఆ సినిమాలో ఈవిడగారి వయసు 15 ఏళ్లేనా? జనాల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టేస్తోందీ సీనియర్ నటి. సరే.. అదంతా వేరే విషయం.
33 ఏళ్ల నుంచి కుష్బూ ఓ వ్యక్తిని కలవడానికి తపస్సు చేసిందట. ఇన్నాళ్లకు కలిశానని తెగ సంబరపడిపోతోంది. ఆ వ్యక్తితో.. తాను దిగిన సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘అతను నా హీరో’ అని కూడా చెప్పేసుకుంది. ‘అతను హీరో అయితే.. పాపం సుందర్.సి?’ అని అడుగుతున్నారు తమిళ తంబీలు.
ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పనేలేదు కదూ. మాజీ క్రికెట్ స్టార్ రవిశాస్త్రి. తన 16 ఏట నుంచీ రవిశాస్త్రిని కలవడం కష్బూ యాంబిషన్ అంట. అయితే... కొన్ని కారణాల వల్ల కుదర్లేదట. ఆయన ఇటీవల చెన్నయ్ వచ్చాడు. దాంతో ఆయన్ను కలిసి సెల్ఫీలు దిగేసింది కుష్బూ.
‘విడ్డూరం కాకపోతే.. రవిశాస్త్రి ఏమైనా.. అంతరిక్షంలో ఉంటాడా? అమెరికాలో ఉంటాడా? ఇండియాలోనేగా ఉండేది. అంతపెద్ద సినిమా స్టార్ అయ్యుండి... రవిశాస్త్రిని కలవడం కుష్బూకు పెద్ద విషయమా? మరీ అతి కాకపోతే...’ అని ఈ విషయంపై పలువురు వెటకారంగా మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం కుష్బూ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె పవన్ అత్తగా కనిపిస్తుందని సమాచారం.