ప్రభాస్ సినిమాలో కృష్ణంరాజు కూడా...
on Jan 18, 2020
రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. తమ్ముడి కుమారుడితో మరోసారి కృష్ణంరాజు కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ వచ్చే వేసవిలో వెండితెరపై సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూరప్ నేపథ్యంలో ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు యూరప్‌లో ఓ షెడ్యూల్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సినిమాలోనే కృష్ణంరాజు నటిస్తున్నారు.
కృష్ణంరాజు పుట్టినరోజు సోమవారం. ఈ సందర్భంగా శనివారం ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అక్కడ మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు... తనయుడితో కలిసి నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్‌పై ఈ సినిమా నిర్మిస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ గురించి కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘మూడు నెలలు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఏప్రిల్, మేలో విదేశాల్లో షూటింగ్ ఉంటుంది. ఈ ఇయర్ ఎండ్‌కి షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఇయర్ సమ్మర్‌కి సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.