మైడీయర్ రౌడీస్- విజయ్ దేవరకొండ!
on Nov 24, 2018

ఎవరైనా హీరో స్టేజీ ఎక్కి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా పద్దతిగానే ఉంటాడు. ఎంత మాస్ స్పీచ్ ఇచ్చినా కూడా అందులో కూడా చాలా జాగ్రత్త కనిపిస్తుంటుంది. అభిమానులకు ఖుషీ చేయించేలా మాట్లాడినా కూడా ఎక్కడా మాటలు అయితే దొర్లవు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం మరోరకం.ఈయన స్పీచ్ వింటుంటే అభిమానులకు ఏదో తెలియని ఉత్సహం వస్తుంది. ఇప్పుడు కూడా ``టాక్సీ వాలా``సక్సెస్ మీట్ లో తన నచ్చినట్లు మాట్లాడి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు ఈ కుర్ర హీరో.
చచ్చిన సినిమా మీరు మళ్లీ ప్రాణం పోసారు థ్యాంక్స్ రౌడీస్ అంటూ ఎమోషనల్ స్పీట్ ఇచ్చాడు విజయ్. మధ్యలో మళ్లీ తన స్టైల్ కూడా వదల్లేదు. ఎన్ని మిడిల్ ఫింగర్స్ చూపించారు భయ్యా. పాపం ఆ రాకర్స్ గీరక్స్ సచ్చిపోతరంటూ మరో బాంబ్ పేల్చాడు. అక్కడితో ఆగకుండా టాక్సీ వాలా హిట్ అవుతుందని తాము కూడా ఊహించలేదని. అంతా ముందుగానే చచ్చిపోయిందని ఫిక్సైపోయారంటూ ఇలాంటి సమయంలో కూడా ప్రమోషనల్ ఆపకుండా చేసి సినిమాను ఈ రోజు బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు విజయ్ దేవరకొండ అంతేకాదు. పైరసి గురించి మాట్లాడుతూ ఇది నేనొక్కన్నే ఏం పీకలేను. ఆ అవేర్ నేస్ అనేది మీ నుంచి రావాలంటూ మాస్ స్పీచ్ ఇచ్చాడు ఈహీరో. ఆయన స్పీచ్ ఇస్తుంటే అంతా అలా చూస్తుండిపోయారంతే. తాను ఎప్పుడు సినిమా చేసిన కూడా గుండెల్లో పెట్టుకుంటున్న మీకు ఏం ఇవ్వగలనంటూ సెంటిమెంట్ డైలాగులు కొడుతూనే పైరసి చేసిన వాళ్లకు తన స్టైల్లో ఎఫ్ డైలాగ్స్ వదిలేసాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. రన్ పూర్తయ్యేసరికి ఆ రేంజ్ ట్రిపుల్ వరకు వెళ్లేలా కనిపిస్తుంది. ఏదేమైనా విజయ్ దేవరకొండ కాన్పిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుందబ్బా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



