అలీ ఇక మారినట్లేనా..?
on Sep 6, 2016
తెరపై నవ్వులు పూయించే కమెడియన్లు స్టేజ్‌పైనా అదే జోష్ నింపాలనుకోవడంలో తప్పు లేదు. కానీ జోక్స్ పేల్చే క్రమంలో అర్ధం పర్ధం లేని మాటలతో తన పరువు పొగొట్టుకోవడంతో పాటు పక్కనున్న వారి పరువు తీయడమే ఇక్కడ పాయింట్. ఆ కమెడియన్ ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయుంటుంది. ఆడియో ఫంక్షన్లలో హీరోయిన్లపై కామెంట్లు చేస్తూ ఆ మధ్య వివాదాలను కొని తెచ్చుకున్నాడు అలీ.
సైజ్ జీరో మూవీ ఆడియో రిలీజ్‌లో అనుష్క తోడలపై అలీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. మనోడి వ్యాఖ్యలు హీరోయిన్లనే కాదు కో-యాంకర్స్‌కి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. అప్పట్లో స్టార్ యాంకర్ సుమపై అలీ వేసిన జోక్స్ పేలకపోగా..వాటికి హార్ట్ అయిన సుమ స్టేజీపైనే అలిగి వెళ్లిపోయింది. అయితే వరుస వివాదాల నుంచి గుణపాఠం నేర్చుకున్న అలీ ఇప్పుడు కాస్త కుదురుగా ఉంటున్నాడు. రీసెంట్‌గా మొగలిరేకులు ఫేం ఆర్‌కె నాయుడు హీరోగా నటించిన "సిద్ధార్థ్" మూవీ ఆడియో లాంఛ్‌లో సందడి చేసిన అలీ..ఇంతకు ముందులా రెచ్చిపోకుండా..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న పరిస్థితులపై సెటెర్లు వేశాడు. స్పీచ్ ముగిసిన వెంటనే సుమను స్టేజ్‌పై చూసి, షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఇంతకు మించి స్టేజ్ మీద ఉండకూడదు. ఇది కూడా నెట్లో పెట్టేస్తున్నారు . ఏం చేసినా ప్రమాదమే అంటూ తనపై సోషల్ మీడియాలో వచ్చే రాతలపై సెటైర్ వేశాడు అలీ.