టీజర్ రివ్యూ: ఈడు గోల్డ్ ఎహె...
on Sep 6, 2016
వరుస ఫ్లాపులతో తన హీరో ఇమేజ్‌ని చేచేతులా డామేజ్ చేసుకొన్నాడు సునీల్. సిక్స్ ప్యాక్ చేసినా, మెలికలు తిరిగిపోయేలా స్టెప్పులు వేసినా.. సునీల్‌ని కనికరించడం లేదు. అందుకే 'సునీల్ బ్యాక్ టూ ఎంటర్‌టైన్' అంటూ ట్యాగ్ లైన్ పెట్టుకొని కామెడీ సినిమాల్ని ట్రై చేస్తున్నాడు. ఆ కోవలో వచ్చిన జక్కన్న కూడా సునీల్‌ని నిరాశ పరిచింది. ఇప్పుడు ఈడు గోల్డ్ ఎహె... లో కామెడీ చేసేద్దామని డిసైడ్ అయ్యాడు. వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. ఇప్పుడు టీజర్‌ని బయటకు తీసుకొచ్చారు. 40 సెకన్ల ఈ టీజర్లో పెద్దగా మెరుపులేం లేవు. సునీల్ గత సినిమాలోని ముక్కల్నే తీసుకొచ్చి ఎడిట్ చేసిన ఫీలింగ్ కలిగింది. చివర్లో విసిరిన `ఫన్నోసెంట్` అనే డైలాగ్‌కి కూడా కనీసం న్యాయం చేయలేదు. సునీల్ మళ్లీ రొటీన్ దారిలోనే నడిచినట్టు అర్థమైపోతోంది. మొత్తానికి ఇదో నిరాశ కలిగించిన రొటీన్ టీజర్. ఆ కొత్తదనం సినిమా కోసం దాచేశారేమో మరి. సినిమా కూడా ఇలానే పాత సినిమా ముక్కల్లా కనిపిస్తే మాత్రం.. మేం చూడమెహె.. అని ఆడియన్స్ బదులిచ్చే ప్రమాదం ఉంది.