ఖుష్బూకు కరోనా.. టూ వేవ్స్ తప్పించుకున్నా.. థర్డ్ వేవ్‌లో దొరికిపోయా!!
on Jan 11, 2022

నటి-రాజకీయవేత్త ఖుష్బూ కొవిడ్ 19 పాజిటివ్‌గా పరీక్షలో నిర్ధారణ అయ్యారు. గత టూ వేవ్స్‌లో కరోనా బారిన పడకుండా తప్పించుకున్న తను, థర్డ్ వేవ్‌లో దానికి దొరికిపోయానని ఒక ట్వీట్‌లో ఆమె చెప్పారు. "ఓకే. ఎట్టకేలకు గత 2 వేవ్స్‌లో తప్పించుకొన్న నన్ను ఈసారి కొవిడ్ పట్టుకుంది. నిన్నటి సాయంత్రం దాకా నేను నెగటివే. ముక్కు కారుతుండటంతో వాయిలాలో టెస్ట్ చేయించుకున్నాను! స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒంటిరిగా ఉండటాన్ని ద్వేషిస్తున్నా. వచ్చే 5 రోజుల దాకా నన్ను ఎంటర్‌టైన్ చేస్తుండండి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోండి." అని సోమవారం ట్వీట్ చేశారు ఖుష్బూ.
Also read: మొన్న విడాకుల న్యూస్.. నేడు తల్లి కాబోతున్నట్లు ప్రకటన
మొదటి రెండు కరోనా వేవ్స్‌ను దాటుకొని వచ్చిన అనేకమంది సెలబ్రిటీలు థర్డ్ వేవ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ బారిన పడుతుండటం చూస్తున్నాం. ఇటీవల మహేశ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్, సత్యరాజ్, త్రిష, శోభన, విష్ణువిశాల్, తమన్ లాంటివాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. సత్యరాజ్ అయితే హాస్పిటల్ పాలై, రీసెంట్‌గా డిశ్చార్జ్ అయ్యారు. దుబాయ్ నుంచి వచ్చాక జరిపిన టెస్ట్‌లో మహేశ్‌కు కొవిడ్ 19 అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిన అతను ఆదివారం కన్నుమూసిన అన్నయ్య రమేశ్‌బాబు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయాడు.
Also read: మౌనం వీడిన భావన.. వేధింపుల కేసుపై ఎమోషనల్ పోస్ట్!
న్యూ ఇయర్ ప్రారంభమవుతుందనంగా తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు త్రిష వెల్లడించింది. తనకు అన్ని రకాల కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు ఆమె చెప్పింది. "నేను గడిపిన బాధాకరమైన వారాల్లో ఇదొకటి అయినప్పటికీ, నేను రికవర్ అవుతున్నా. ఇవాళ బాగానే ఉంది. థాంక్స్ టు మై వాక్సినేషన్స్" అని ఆమె రాసుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



