చిరంజీవి కోర్టును ధిక్కరించినట్లేనా...?
on Dec 16, 2016
.jpg)
తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత అభిమానులను పలకరించడానికి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన ఖైదీ నెం.150 షూటింగ్ కంప్లిట్ చేసుకుని రిలీజ్‌కు దగ్గరైంది. ఈ నెల 25 లేదా 30న విజయవాడలో ఆడియో గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో లాంచ్‌కు వేదికగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంను అనుకుంటున్నారు..కానీ ఇక్కడే ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2015లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం..ఈ స్టేడియంను కేవలం ఆటలకు సంబంధించిన కార్యక్రమాల కోసమే ఉపయోగించాలి.
అయితే అందుకు మినహాయింపుగా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రం..ఎవరన్నా ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లే ఛాన్సు కూడా ఉంది. అందుకే ఈ ఫంక్షన్ కోసం జిల్లా కలెక్టర్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీఈవో పున్నయ్య చౌదరి మాట్లాడుతూ..1974 నుంచి ఈ స్టేడియంను సినిమా ఫంక్షన్లకు వాడుతున్నామని..అందువల్ల ఎలాంటి భయం లేదని అంటున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఖైదీ అండ్ టీమ్ కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లే. మరి ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఏదురైతే చిత్రయూనిట్‌కు తిప్పలు తప్పవు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



