దేశభక్తుల టార్గెట్‌గా అరవింద్
on Dec 16, 2016

సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లలో జాతీయగీతాన్ని తప్సనిసరిగా ప్రసారం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా మరికొందరు ఈ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటి అందాల హీరో..నేటి స్టైలిష్ విలన్ అరవింద్ స్వామి సుప్రీం నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే చోట..క్రీడా కార్యక్రమాల వద్ద జాతీయగీతాన్ని పాడితే బాగుంటుంది కానీ..థియేటర్లలో పాడాలని చెప్పడం అర్థంపర్థం లేని పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మరోసారి పున:సమీక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు అరవింద్. ఈ వ్యాఖ్యలపై జాతీయవాదులు మండిపడుతున్నారు. రోజా లాంటి దేశభక్తి సినిమాలో నటించిన ఆయనకు దేశభక్తి లేదని ఆరోపిస్తున్నారు. అరవింద్ తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



