పవన్ తెలివే తెలివి.. రూ.40 కోట్లు మిగిలాయి!
on Mar 21, 2017

సినిమా ఇండ్రస్ట్రీలో డబ్బులు పోగొట్టుకొన్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. సినిమాలు తీసి పాపర్ అయిపోయినవాళ్లు, అప్పులు చేసి ఐపీ ఎత్తేసినవాళ్లు కోకొల్లలుగా కనిపిస్తారు. కానీ... కాస్త తెలివిగా ప్రవర్తించాలే గానీ... సినిమాలు తీసి కోట్లు పోగేసుకోవొచ్చు. జస్ట్... క్రేజ్‌ని క్యాష్ చేసుకొనే టెక్నిక్ తెలిసుండాలంతే. ముఖ్యంగా పెద్ద సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు విడుదలకు ముందే బిజినెస్ చేసుకొంటుంటాయి. టేబుల్ ప్రాఫిట్ రూపంలో కోట్లు వెనకేసుకొంటాయి. ఇదంతా.. టెక్నిక్ మహత్యమే. ఇదే టెక్నిక్ ఫాలో అయిపోయాడు పవన్ కల్యాణ్.
తన తాజా చిత్రం కాటమరాయుడు ద్వారా పవన్‌కి రూ.40 కోట్లు మిగిలాయన్నది టాలీవుడ్ టాక్. ఈ సినిమాకి పవన్ ఒకానొక నిర్మాత అన్న సంగతి తెలిసిందే. తెర ముందు శరత్ మరార్ పేరు కనిపిస్తున్నా... వెనుక మాత్రం లాభాల్లో ఎక్కువ శాతం వాటా పవన్‌కే దక్కుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందే కాటమరాయుడు దాదాపు గా రూ.100 కోట్ల బిజినెస్ చేసుకొంది.
పవన్ పారితోషికాన్ని తీసి పక్కన పెడితే మేకింగ్ కి రూ.20 కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యిందని టాక్. పవన్ పారితోషికం రూ.25 కోట్లు అనుకొంటే.. మొత్తంగా రూ.45 కోట్ల రూపాయల్లో కాటమరాయుడు సినిమా పూర్తయ్యింది. అంటే మరో రూ.65 కోట్ల లాభమన్నమాట. అందులో శరత్ మరార్ చేతికి వెళ్లింది పాతిక కోట్లేనని, మిగిలినదంతా పవన్ ఖాతాలోకి మళ్లిందని టాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. అంటే.. పవన్ ఈ సినిమా ద్వారా మొత్తంగా రూ.65 కోట్లు సంపాదించాడన్నమాట. డబ్బులపై వ్యామోహం లేదంటూనే పవన్ ఈ స్థాయిలో బిజినెస్ నైపుణ్యం ప్రదర్శించాడంటే పవన్ మామూలోడు కాదుగా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



