చెర్రీ తన జీవితంలో మిస్సైంది అదే..?
on Mar 21, 2017

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి..డ్యాన్సులు, ఫైట్లు, నటనలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుని... మెగాపవర్ స్టార్‌గా అభిమానుల చేత పిలిపించుకుంటున్నాడు రామ్‌చరణ్. అయితే ఎంతటి వారికైనా..ఎన్ని ఉన్నా..జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది..అందుకు చెర్రీ కూడా మినహాయింపు కాదు..విశాఖలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజీ ఫెస్ట్‌కు హాజరైన చెర్రీ తన జీవితంలోని పలు సంఘటనలను విద్యార్థులతో పంచుకున్నారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడంతో కాలేజీకి సరిగా వెళ్లలేకపోయానని..కాలేజ్ లైఫ్‌ను చాలా మిస్సయ్యానని..అది గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉంటుందని చెర్రీ ఉద్వేగంతో అన్నాడు. ఏదైనా చేయగలమనే బలం విద్యార్థిగా ఉన్నప్పుడే ఉంటుందని..దానికి జాగ్రత్త తోడయితే మీ డెస్టినీ అద్భుతంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో రామ్ చరణ్ బర్త్ డే కేక్ కట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



