అల్లు శిరీష్‌కు పవన్ ఏమవుతాడు..?
on Mar 21, 2017

ఇదేం పిచ్చి ప్రశ్న.. అల్లు శిరీష్‌కు చిరు మావయ్య అవుతాడు కాబట్టి పవన్ కూడా మావయ్యే అవుతాడు..అది కూడా తెలియదా అని మీరు అనుకోవచ్చు . ఇప్పుడు ఈ డౌట్ రావడానికి కారణం అల్లు శిరీషే. రీసెంట్‌గా పవన్ నటించిన కాటమరాయుడు ట్రైలర్‌పై స్పందించిన శిరీష్ ట్వీట్టర్‌లో కాటమరాయుడు టీమ్‌కి విషెస్ చెబుతూ.."సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు.. కళ్యాణ్ బాబాయ్‌కి, శరత్ మరార్, దర్శకుడు డాలీకి శుభాకాంక్షలు" అంటూ చెబుతూ ట్వీట్ చేశాడు..
.jpg)
అదేంటి పవన్ శిరీష్‌కి మావయ్య అవుతాడు కదా..? బాబాయ్ అంటాడేంటి అని సందేహం వచ్చిన ఓ అభిమాని దీనిపై శిరీష్‌ని ట్విట్టర్‌లో వివరణ కోరాడు..దీనిపై స్పందించిన శిరీష్..చిన్నప్పుడు చరణ్, బన్నీ, నేను కలిసి పెరిగాం..చెర్రీ పవన్‌ను బాబాయ్ అని పిలుస్తుండటంతో నేను అలాగే పిలిచేవాణ్ణి..అదే అలవాటుగా ఇప్పటికీ పవన్‌ని బాబాయ్ అని పిలుస్తాను అని రీట్విట్ చేశాడు. సో అదన్న మాట మ్యాటర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



