చిరు 151వ సినిమా కథ తెలుసా??
on Mar 20, 2017
.jpg)
చిరంజీవి తన 40 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ఓ చారిత్రక యోధుడి కథని సినిమాగా తీయబోతున్నాడు. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు ఖరారు చేయడం, నిర్మాణ బాధ్యతల్ని రామ్ చరణ్ తీసుకోవడం తెలిసిన విషయాలే. చిరు 151వ చిత్రంగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనగానే.. అతనెవరు? సినిమాగా తీయాల్సినంత గొప్ప జీవితం ఏముంది?? ఆ కథలో హీరోయిజం ఆ స్థాయిలోఉంటుందా?? అనే ఆరాలు, అంచనాలు మొదలైపోయాయి.
నిజం చెప్పాలంటే ఉయ్యాల వాడ నరసింహారెడ్డి హీరోలకే హీరో. ఆయన కథలో... కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చిరు.. ఆ కథని ఏరి కోరి ఎంచుకొన్నాడు. ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ది కర్నూలు జిల్లా. అక్కడ ఉయ్యాల గ్రామంలో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచే నరనరాన దేశభక్తి ఎక్కించుకొన్న.. మహా వీరుడు. ఈయనకు 66 గ్రామాల్లో 2వేల వరకూ సైన్యం ఉండేది. నిజాం నవాబుల కాలంలో నరసింహరెడ్డి తాత ముత్తాతలు స్థానిక పరిపాలన బాధ్యతలు తీసుకొన్నారు. ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశారు. ప్రజలకు ఏ లోటూ రాకుండా చూసుకొన్నారు. అయితే.. బ్రిటీష్ వాళ్ల రాజ్యాధికారంలో చాలా మార్పులొచ్చాయి. పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. అంతేకాదు ఆస్తుల్ని ఆక్రమించుకొని... బానిసలుగా చూడడం మొదలెట్టింది.
దాంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. తన సైన్యంతో, గొరెల్లాయుద్ధ పద్ధతుల్లో బ్రిటీష్ వారిని గడగడలాడించాడు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి తలకు రేటు ప్రకటించింది బ్రిటీష్ ప్రభుత్వం. చివరికి బ్రిటీష్ వాళ్లు ఈ భరతమాత ముద్దు బిడ్డని ఉరి తీసింది. అయితే... ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ఇచ్చిన స్ఫూర్తి మాత్రం స్వాతంత్య్ర సమరయోధులకు ఓ టానిక్ లా ఉపయోగపడింది. అదీ.. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథ. యుద్ధాలు, యుద్ధ వ్యూహాలకు ప్రాధాన్యం ఉండడంతో విజువల్‌గా గ్రాండ్ గాతీర్చిదిద్దాలని చిరు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఎంత బడ్జెట్ అయినా వెనుకాడకుండా ఖర్చు చేయడానికి చరణ్ కూడా... సిద్ధంగా ఉన్నాడు. సో.. తెలుగు ప్రేక్షకులు మరో విజువల్ ట్రీట్.. చూడ్డానికి సిద్ధంగా ఉండాల్సిందే అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



