కమల్ మళ్ళీ తెలుగులో...
on Feb 28, 2015
మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ ముగింపు ఎపిసోడ్ కు ముఖ్యఅతిధిగా హాజరైన కమల్ ఆసక్తికర విషయాలను తెలియజేశారు. కమల్ రాగానే నాగ్ తెలుగులో సినిమా చేసి చాన్నాళ్లయింది, మళ్లీ ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా, ఉత్తమవిలన్ సినిమా పూర్తి కాగానే తెలుగు సినిమా చేస్తానని ప్రకటించారు. అలాగే ఈ సందర్భంగా గాంధీ ప్రస్తావన వచ్చింది. ''మానాన్న స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. ఆయన మహాత్మా గాంధీకి వీరాభిమాని. నేను మాత్రం గాంధీని మహాత్ముడిగా చూళ్లేకపోయాను. అయితే నాన్న ఎప్పుడూ నా అభిప్రాయాలను తప్పు అనలేదు. క్రమంగా నేనూ గాంధీ గురించి తెలుసుకొని ఆయనకు అభిమానిగా మారిపోయా. నా దృష్టిలో గాంధీ ఓ గొప్ప నటుడు. లోపల ఎన్ని భావాలున్నా పైకి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ కనిపించారు. ఓ ఉన్నత కుటుంబంలో పుట్టి సామాన్య జీవనం సాగించారు. ఆయనలా ఆలోచించడం, దేశానికి సేవ చేయడం ఎవరి వల్లా కాదు... గాంధీని ఇప్పటికీ మహాత్ముడిగా చూళ్లేను. ఎందుకంటే ఆయన నా మనసులో ఉన్నారు. మిస్టర్ గాంధీ అని పేరు పెట్టి పిలిచేంత దగ్గరైపోయా..'' అని చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
