గుడ్ బై చెప్పేసిన నాగ్
on Feb 28, 2015
మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రశ్నలతో ముంచెత్తి.. నోట్ల కట్టలు అందించాడు నాగార్జున. మా టీవీలో ప్రసారమైన ఈ షో.. సూపర్ హిట్టయ్యింది. రెండు సెషన్లకూ మంచి రేటింగులు వచ్చాయి. తొలి సెషన్ ఇచ్చిన స్ఫూర్తితో రెండో సెషన్ మొదలెట్టారు. ఇప్పుడు ఈ సెషన్‌కీ శుభం కార్డు పడింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌తో శుభం కార్డు పడింది. శుక్రవారం నాగ్ ఈ షోకి గుడ్‌బై చెప్పేశాడు. ఇక మీ.ఎ. కో మూడో సెషన్ ఉంటుందా, లేదా?? అనేది అనుమానంగా మారింది. ఈ షోకి ఇక్కడితో పుల్‌స్టాప్ పడిపోయినట్టే అని మాటీవీ వర్గాలూ భావిస్తున్నాయి. ఎందుకంటే మా ఇప్పుడు స్టార్ కుటుంబంలో కలిసిపోయింది. నాగ్, చిరు ఇద్దరూ తమ వాటాని అమ్ముకొన్నారు. ఇది వరకటిలా నాగ్ ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఈ షోపై స్టార్ టీవీ ఎలా ఆలోచిస్తుందో ఇప్పటి వరకూ ఎవరికీ అంతుపట్టడం లేదు. మరోవైపు నాగ్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక మీదట పూర్తిగా సినిమాలపై దృష్టి పెడదామనుకొంటున్నాడు నాగ్. అందుకే... మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని ఇక మా లో చూడకపోవచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
