తాత కాబోతున్న బాలయ్య
on Feb 28, 2015
.jpg)
నందమూరి అభిమానులకు శుభవార్త! నందమూరి అందగాడు బాలకృష్ణ త్వరలోనే తాతయ్య కాబోతున్నారు. బాలకృష్ణ కుమార్తె, నారా లోకేష్ భార్య.. బ్రాహ్మణి ఇప్పుడు నిండు గర్భిణీ. ఇటీవల సీమంతం కార్యక్రమం కూడా జరిగిందని సమాచారమ్. త్వరలోనే బాలయ్య `తాతయ్య అన్న పిలుపు..` అంటూ పాటలూ పాడుకోనున్నాడన్నమాట. మరోవైపు బాలయ్య 100వ సినిమా గురించిన చర్చలు వాడీవేడీగా సాగుతున్నాయి. బాలయ్య వందో సినిమాకోసం వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి వరుసగా కథలు వింటున్నారు. ఇప్పటికే.. బోయపాటి శ్రీను ఓ లైన్ ప్రిపేర్ చేశారు. దానికంటే మంచి కథలు వస్తే... ఓకే చేయడానికి అటు బాలయ్య, ఇటు బోయపాటి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అన్నట్టు లయన్ ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నదని సమాచారమ్. చూశారా.. బాలయ్య అభిమానులకు ఎన్ని శుభవార్తలో...??!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



