ఏమ్మా నయనా..మళ్లీనా..!
on Jun 13, 2016
నయనతారకు లవ్ అనేది అస్సలు కలిసొచ్చినట్టు లేదు. ప్రేమించడం, బ్రేకప్ చెప్పడం ఆమెకు కామన్ గా మారిపోయింది. ప్రేమించినంత కాలం చాలా డీప్ గానే ఉంటుంది. అయితే ఏమవుతుందో ఏమో, పెళ్లి వరకూ వెళ్లే లోపే ఆ బంధం బ్రేకప్ అయిపోతుంటుంది. నయన్ శింబు పేర్లు సినిమాల కంటే, వాళ్ల అఫైర్ కారణంగానే అంత ఫ్యామస్ అయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకుంటున్న సమయంలో దూరమైపోయారు. ఈ బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయిన నయన్, ఎలాగోలా మళ్లీ కెరీర్ ను పట్టాలెక్కించింది.
అంతా బాగుందనుకుంటున్న సమయంలో ప్రభుదేవాతో ప్రేమకథ మొదలెట్టింది. అతని కోసం తన మతాన్ని మార్చుకుంది. సినిమాలు మానేస్తానని చెప్పేసింది. ప్రభుకు రెండో భార్యగా వెళ్లడానికి సిద్ధపడింది. మరి ఏమైందో, ఈ బంధం మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఆ తర్వాతి నుంచి ఆమె ప్రేమలో పడటం అసాధ్యమనుకున్నారు సినీజనాలు. వాళ్లందరికీ షాక్ ఇస్తూ, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమ బంధాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇతనితో కూడా బ్రేకప్ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ గత కొంత కాలంగా వీళ్లిద్దరూ కనీసం మాట్లాడుకోవడానికి ఆసక్తి చూపించట్లేదని, ఒకరికి ఒకరు డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ పెద్దగా అచ్చొచ్చినట్టు లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ గురించి ఆలోచించు నయన్ అంటున్నారట ఆమె సన్నిహితులు.