పిల్లలకు పేర్లు పెట్టిన కమల్ హాసన్..!
on Apr 14, 2016

సకలకళావల్లభుడు అన్న పేరు కమల్ హాసన్ కు నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. రియల్ లైఫ్ లో ఐనా, రీల్ లైఫ్ లో ఐనా, కమల్ అన్ని కళల్లోనూ ప్రావీణ్యుడే. అయితే, తనలో భాషాప్రవీణుడు కూడా ఉన్నాడని చూపిస్తున్నాడీ లోకనాయకుడు. కమల్ తో తూంగావనం సినిమాను తెరకెక్కించిన రాజేష్ ఎం సెల్వ, తన కూతురికి పేరు పెట్టమంటే, హోషికా మృణాళిని అనే ప్రత్యేకమైన పేరును పెట్టాడు కమల్. లేటెస్ట్ గా తమిళ డాన్స్ డైరెక్టర్ శోభి పాల్రాజ్ కూడా తన కూతురికి నామకరణ మహోత్సవం చేస్తూ కమల్ ను, గౌతమిని ఆహ్వానించి పేరు సజెస్ట్ చేయమన్నాడు. ఈ సారి కూడా శ్యమంతకమణి అశ్విక అంటూ పేరు పెట్టి తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నాడు. పేర్లు ఏం పెట్టాలో తెలియక అర్ధం పర్ధం లేని పేర్లు పెడుతున్న ఈ కాలంలో, ఇలాంటి వైవిధ్యమైన, విభిన్నమైన పేర్లు పెట్టిన కమల్ ను, లోగనాయగన్ కు ఎన్న తెలివప్పా..మంచిపేరు సూసి పూడ్సినాడు అంటూ పొగిడేస్తున్నారు తమిళ తంబీలు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



