ఈ రోజే బాహబలి పార్ట్ 2 రిలీజ్..!
on Apr 14, 2016

అదేంటి..ఈ రోజు బాహుబలి రీలీజేంటా అని కంగారు పడి థియేటర్స్ కు వెళ్లకండి. టిక్కెట్స్ లేవు. విషయమేంటంటే, వచ్చే ఏడాది అంటే 2017 ఏప్రిల్ 14న బాహుబలి ది కంక్లూజన్ కు రిలీజ్ డేట్ ఇచ్చాడు దర్శక జక్కన్న. వచ్చే ఏడాది ఈ టైం కి మంచి హడావిడిగా ఉంటాయి థియేటర్లన్నీ. నేషన్ వైడ్ గా టాక్ తప్ప పెద్ద గుర్తింపు లేని మొదటి పార్ట్ రిలీజ్ కే టికెట్స్ భీభత్సం జరిగింది. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సెకండ్ పార్ట్ కు ఇంక ఏ రేంజ్ లో హడావిడి ఉంటుందో చెప్పనే అక్కర్లేదు. ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతీ ఒక్కరూ తప్పక సెకండ్ పార్ట్ చూస్తారు. ఇప్పటికే బాలీవుడ్ లో అక్కడి ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రిలీజ్ డేట్ ను ప్రకటించేసిన కారణంగా, రాజమౌళికి ఇక వేరే ఆప్షన్ లేదు. తప్పనిసరిగా సినిమాను ఇదే డేట్ కు రిలీజ్ చేయాలి. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ కానిస్తూ పని రాక్షసుడు అన్న పేరును సార్థకం చేసుకుంటున్నాడు. ఏడాది పాటు అంటే, చాలా లాంగ్ గ్యాప్ అయినా, అభిమానులు వెయిట్ చేయక తప్పదు మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



