నిర్మాత కూతురితో కుర్ర డైరెక్టర్ జంప్..!
on Apr 14, 2016

సినిమాల్లో హీరోలు హీరోయిన్లను చీటికీ మాటికీ లేచిపోదాం రా అనడం, జంప్ జిలానీ అనడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక కుర్ర దర్శకుడు ఇలాగే జంప్ అయిపోయాడని ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. రీసెంట్ గా ఘట్టమనేని వారి కుర్ర హీరోతో సినిమా తీసిన ఒక యంగ్ డైరెక్టర్, నిర్మాత కూతుర్ని తీసుకుని జంప్ అయిపోయాడట. గత రెండేళ్లుగా వీరిద్దరికీ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందట. అది కాస్తా ఆమె తండ్రి, నిర్మాత అయిన పెద్దాయనకు తెలిసి, అమ్మాయికి వేరే సంబంధం ఫిక్స్ చేశారట. ఏప్రిల్ 17 న గ్రాండ్ గా పెళ్లిని కూడా ప్లాన్ చేశారట. పెళ్లికి ఇంకో మూడు రోజులుందనగా, ఇప్పుడు ఆ డైరెక్టర్ అమ్మాయితో జంపైపోయాడు. అతను తీసిన సినిమా కూడా, పెళ్లి కూతుర్ని పెళ్లి మధ్యలో ఉండగా కిడ్నాప్ చేసే కథతో ఉంటుంది. కరెక్ట్ గా అదే తరహాలో పక్కా స్కెచ్ వేసి, సినీ ఫక్కీలో అమ్మాయిని తీసుకెళ్లిపోయాడట. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఎక్కడున్నారన్నది ఫిల్మ్ వర్గాలకు కూడా తెలియట్లేదు. త్వరలోనే ఈ డైరెక్టర్ నాని హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సంఘటనపై నిర్మాత కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని సమాచారం. మరి ఈ ప్రేమకథ ముగింపు ఎలా ఉంటుందో చూడాలి. సినీ వర్గాల్లో ఈ విషయం సంచలనంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



