రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ హాసన్
on Sep 17, 2019
నిజమే... కమల్ హాసన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన ఏ తప్పూ చేయలేదు. తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. అన్యాయంగా ఆయన్ను అరెస్ట్ చేసి ఎవరో జైల్లో వేయలేదు. మరి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ ఎందుకు ఉన్నారు? అంటే... సినిమా షూటింగ్ కోసం! లోక నాయకుడు కమల్ హాసన్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఇండియన్ 2'. తమిళంలో 'ఇండియన్'గా, తెలుగులో 'భారతీయుడు'గా విడుదలైన సినిమాకు ఇది సీక్వెల్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతోంది. సమాజంలో అవినీతిపై శంకర్ సంధించిన సినిమా అస్త్రం 'భారతీయుడు'. ఈ సీక్వెల్ లో ఏ సమస్యలను ప్రస్తావిస్తాస్తున్నారో? కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జోడీగా నటిస్తున్నారు.