బాలకృష్ణ నెక్ట్స్ విలన్ ఎవరో తెలుసా?
on Sep 17, 2019
'జై సింహా' హిట్ కాంబినేషన్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో విలన్ ఎవరో తెలుసా? శతఫ్ ఫిగర్. పేరు కొత్తగా ఉంది కదూ. తెలుగు తెరకు ఈ నటుడు కూడా కొత్తే. బాలకృష్ణ కోసం బెంగాలీ నటుడ్ని విలన్ గా తీసుకొచ్చారు దర్శకుడు కె.ఎస్. రవికుమార్. ప్రజెంట్ శతఫ్ హిందీలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. రాజ్ కుమార్ హీరోగా నటించిన 'మేడ్ ఇన్ చైనా'లో కీ రోల్ చేశాడు. 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ లో హీరో కార్తీక్ ఆర్యన్ కి ఫాదర్ గా నటిస్తున్నాడు. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దర్శకుడు విష్ణువర్థన్ తెరకెక్కిస్తున్న 'షేర్ షా'లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)