కళ్యాణ్ రామ్ డెవిల్ నాలుగు రోజులకి ఇంతే!
on Jan 2, 2024
.webp)
నందమూరి కళ్యాణ్ రామ్ నట విశ్వరూపాన్ని మరోసారి చూపించిన మూవీ డెవిల్. మొన్న డిసెంబర్ 29 న వరల్డ్ వైడ్ గా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన డెవిల్ అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని రోజు రోజుకి కలెక్షన్స్ ని పెంచుకుంటు ముందుకు దూసుకుపోతుంది.
డెవిల్ మూవీ నాలుగు రోజులకి గాను 22 .59 కోట్ల గ్రాస్ ని సాధించింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉండి ఒక కొత్త ప్రపంచాన్ని తమకి చూపించిందని అంటున్నారు. అంతే కాకుండా తమకి తెలిసిన వాళ్లందరికీ కూడా మూవీ చాలా బాగుందని చెప్తున్నారు. కళ్యాణ్ రామ్ తో పాటు మూవీలో చేసిన అందరు కూడా సూపర్ గా నటించారనే ప్రశంసలు డెవిల్ కి దక్కుతున్నాయి.

కళ్యాణ్ రామ్ ఈ మూవీలో బ్రిటిష్ సంస్థానంలో పని చేసే ఒక సీక్రెట్ ఏజెంట్ గా నటించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో ఆర్ ఆర్ ఆర్ ఫేమ్ ఎడ్వర్డ్ తో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ,సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ నామ స్వీయ దర్శకత్వంలో డెవిల్ రూపొందింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



