ప్రభాస్ సందీప్ రెడ్డి ల స్పిరిట్ చిరంజీవి నటించిన ఎస్ పి పరశురామ్ సినిమానా?
on Jan 2, 2024

యానిమల్ విజయంతో ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది.దీంతో సందీప్ నెక్స్ట్ చెయ్యబోయే ప్రభాస్ మూవీ స్పిరిట్ గురించి ఇప్పుడు అందరు చర్చించు కుంటున్నారు. ఈ క్రమంలో స్పిరిట్ కథ గురించి ఒక రూమర్ ఇప్పుడు వినిపిస్తుంది.
సందీప్ ప్రభాస్ ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా స్పిరిట్. అసేతు హిమాచలం మొత్తం స్పిరిట్ కోసం ఎదురుచూస్తు ఉంది. ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ మూవీ కథ మెగాస్టార్ చిరంజీవి హీరోగా 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఎస్ పి పరశురామ్ మూవీ కథతో త్తెరకెక్కబోతుందనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. 1994 లో వచ్చిన ఆ మూవీలో పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ అయిన చిరంజీవి అవినీతి అక్రమాలు చేసే రాజకీయనాయకుల ఆట కట్టిస్తాడు. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందనే పుకారు అయితే చాలా బలంగా ఉంది.

యానిమల్ కథ కూడా చిరంజీవి హీరోగా 1986 లో వచ్చిన కిరాతకుడు కథనే పోలి ఉంటుంది.ఆ మూవీలో చిరంజీవి తన పసితనం నుంచే తండ్రి ప్రేమ కోసం పరితపిస్తు ఉంటాడు. కానీ తండ్రి బిజినెస్ లో పడిపోయి చిరంజీవిని పట్టించుకోడు.. ఆ తర్వాత చిరంజీవి కిరాతకుడుగా మారిపోతాడు..ఆ మూవీలో చిరంజీవి తండ్రిగా కళావాచస్పతి జగ్గయ్య నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



