కొత్త సంవత్సరం అందరికీ షాక్ ఇచ్చిన సాయిపల్లవి.. ఏం చేసిందో తెలుసా?
on Jan 2, 2024
.webp)
హీరోయిన్ సాయిపల్లవి అంటే సింప్లిసిటీకి మారుపేరు. సినిమా తార కంటే తన వ్యక్తిత్వంతోనే ఆమె ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అందం, అభినయం కలగలిసిన సాయి పల్లవికి సౌత్ రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఎక్కువే. తను చేసే సినిమాలే కాదు, ఆమె యాటిట్యూడ్ కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. సాధారణంగా న్యూ ఇయర్ వేడుకలు అందరూ ఎలా చేసుకుంటారో మనకు తెలిసిందే. ఇక సినిమా తారల విషయానికి వస్తే ఒక రేంజ్‌లో సెలబ్రేట్ చేస్తారు. హంగు, ఆర్భాటాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ, సాయిపల్లవి దానికి భిన్నంగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొని మరోసారి అందరి మనసుల్ని దోచుకుంది.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సెలబ్రిటీలు కాస్తంత సౌండ్‌గానే న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేశారు. కొంతమంది ఆరోజును తమ కుటుంబసభ్యులకు కేటాయిస్తే మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. కొందరు హీరోయిన్లు బీచ్‌లో బికినీల్లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. కానీ, సాయిపల్లవి మాత్రం పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయంలో కనిపించింది. చీరకట్టుతో సంప్రదాయంగా వచ్చిన సాయిపల్లవి అక్కడ ఉన్న వారందరితోపాటు సత్యసాయి నామ స్మరణ చేస్తూ ధ్యానంలో ఉండిపోయింది. దీంతో ఆమె సింప్లిసిటీ ఏమిటో అందరికీ అర్థమైపోయింది. స్టార్ హీరోయిన్ రేంజ్ ఉన్నప్పటికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ ఆర్భాటం చేయకుండా సైలెంట్‌గా దేవుని సన్నిధిలో గడిపిన సాయిపల్లవిని చూసి అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మిగతా హీరోయిన్లు కూడా సాయి పల్లవిని ఫాలో అవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



