బాలీవుడ్‌లో నటించే ఛాన్స్ కోసం చూస్తున్న తారక్!
on Dec 22, 2021

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాజమౌళి టీమ్ ప్రమోషన్స్‌ను స్పీడప్ చేసింది. సౌత్ ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు ముంబైలోనూ ప్రమోషనల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా ముంబైలో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్‌లో భాగంగా మీడియాతోనూ ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నారు తారక్, చరణ్. ఈ సందర్భంలో తన బాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు తారక్.
Also read: 'శ్యామ్ సింగ రాయ్' కథ ఇదేనా?.. ఇంట్రెస్టింగ్ డీటైల్స్!
"మీరు హిందీ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తారు?" అనే ప్రశ్న ఓ మీడియా ప్రతినిధి నుంచి ఎదురుకాగా, "నేను కూడా హిందీ సినిమా అవకాశాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజయ్యాక, ఇక్కడి సినిమాల్లో నాకు చాన్సులు రావచ్చని అనుకుంటున్నా" అని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. గతంలో తారక్ సహనటుడు చరణ్ 'జంజీర్' రీమేక్ ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్లీ ఇంతదాకా ఆయన మరో హిందీ సినిమా చెయ్యలేదు.
Also read: మహేష్ బాబు నా హీరో అన్న రాజమౌళి.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రధారులు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఆలియాకు తెలుగులో ఇదే ఫస్ట్ ఫిల్మ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



