`రాఖీ`గా ఎన్టీఆర్ అలరించి నేటికి 15 ఏళ్ళు!
on Dec 22, 2021

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో `రాఖీ` ఒకటి. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో రామకృష్ణ అలియాస్ రాఖీగా తారక్ అభినయం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆడపిల్లలపై జరిగే అన్యాయాలకు, అకృత్యాలకు ప్రతిఘటించే రాఖీ పాత్రలో నెవర్ సీన్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇలియానా, ఛార్మి నాయికలుగా నటించగా మంజూష చెల్లెలి పాత్రలో దర్శనమిచ్చింది. సుహాసిని, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, శరత్ బాబు, బ్రహ్మాజీ, శరణ్య, బ్రహ్మానందం, సాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఉత్తేజ్, హర్షవర్ధన్, కొండవలస, సమీర్, కృష్ణభగవాన్, రఘు కారుమంచి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. ప్రకాశ్ రాజ్ అతిథి పాత్రలో అలరించారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో ``రాఖీ రాఖీ``, ``జర జర``, ``వస్తవ వస్తావా``, ``రంగు రబ్బా రబ్బా``, ``నిన్ను చూస్తే``, ``కళ్ళల్లో కాలాగ్ని``.. ఇలా అన్ని పాటలు ఆదరణ పొందాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మించిన `రాఖీ`.. 2006 డిసెంబర్ 22న విడుదలై 30 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. నేటితో ఈ చిత్రం 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



