ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేసిన ఎన్టీఆర్, అఖిల్..!
on Apr 23, 2016

కొన్ని రోజుల క్రితం, వేలంలో పదిలక్షలు పెట్టి, ఎన్టీఆర్ టిఎస్ 09 ఈఎల్ 9999 అనే నెంబర్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తన లక్కీ నెంబర్ అని ఎన్టీఆర్ ఫీల్ అవుతారు. అందుకే దీనికోసం ఖర్చుకు వెనకాడకుండా పాట పాడారు. తను కొత్తగా కొనుక్కున్న కారును రిజిస్ట్రేషన్ చేయించడానికి ఎన్టీఆర్ ఈరోజు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. మరో టాలీవుడ్ స్టార్ అఖిల్ కూడా తన కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు.

అఖిల్ నెంబర్ టిఎస్ 09 ఈఎల్ 9669 కోసం 41 వేలు చెల్లించారు. ఈ రోజు మంచిరోజు కావడంతో ఇద్దరు హీరోలు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారని సమాచారం. మరో వైపు, స్టార్ హీరోలు రావడంతో, పని మీద ఆఫీస్ కు వచ్చిన వారందరూ తమ పనిని వదిలేసి హీరోలను చూసేందుకు ఎగబడడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



