పాలిటిక్స్ లోకి ఎంటరైన హాట్ భామ..!
on Apr 23, 2016

బొద్దు సుందరి పాలిటిక్స్ లోకి ప్రవేశించింది. తమిళనాడులో సూపర్ క్రేజ్ సంపాదించిన హీరోయిన్ నమిత ఏఐడిఎంకే పార్టీలో చేరింది. తమిళనాట ఒకప్పుడు నమిత కటౌట్ కు అభిషేకాలు, ఆమెకు గుళ్లు కట్టిన సందర్భాలున్నాయి. సినిమాల్లో ఇప్పుడున్న గ్లామర్ పోటీకి ఎలాగూ నిలవడం కష్టం కాబట్టి, తనకున్న ప్రజాభిమానాన్ని రాజకీయాలకు ఉపయోగించకోవాలనుకుందో ఏమో కానీ, ఏఐడిఎంకే అధినేత్రి జయలలితను కలిసి, పార్టీ సభ్యత్వాన్ని పుచ్చుకుంది. నమితకు మాస్ జనాల్లో ఉన్న క్రేజ్ తన పార్టీకి ఉపయోగపడుతుందని జయ భావించారనేది స్పష్టం. ఒకవేళ ఈ ఎలక్షన్లలో గనక జయ పార్టీ గెలిస్తే, నమితకు ఫ్యూచర్లో పదవులు వచ్చే అవకాశం ఉందా..? చూడాలి మరి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



