జనతా గ్యారేజ్ లో సూపర్ స్టార్ కీలక పాత్ర..!
on Apr 13, 2016
శ్రీమంతుడు తీసిన కొరటాల శివ, సక్సెస్ మీదున్న ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా కావడంతో, జనతా గ్యారేజ్ పై మంచి అంచనాలున్నాయి. అందుకే ఈ మూవీ టీం ఎక్కడా తగ్గకుండా, భారీ క్యాస్టింగ్, తారాగణంతో సినిమాను సిద్ధం చేస్తున్నారు. మోహన్ లాల్, సాయికుమార్ లాంటి స్టార్స్ ను సినిమాకు తీసుకున్న కొరటాల, తాజాగా ఒక కీలక పాత్రను సూపర్ స్టార్ కృష్ణ చేత చేయించబోతున్నాడట. అంతకు ముందు ఆ పాత్రకు సత్యరాజ్ ను అనుకున్నా, చాలా సినిమాలతో బిజీగా ఉన్న సత్యరాజ్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో, కొరటాల ఈ ప్లాన్ వేశాడట. ఆల్రెడీ మహేష్ తో శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడికి వాళ్ల కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. కృష్ణ కూడా కొరటాల అడగ్గానే సరేనన్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, ఎన్టీఆర్ సినిమాకు నందమూరి అభిమానులతో పాటు ఘట్టమనేని అభిమానులు కూడా తోడవుతారన్నమాటే..