వాళ్లందరికీ షాక్ ఇచ్చిన రాజమౌళి..!
on Apr 13, 2016
రాజమౌళి సింప్లిసిటీ గురించి టాలీవుడ్లో చాలామందికి తెలుసు. సక్సెస్ వచ్చినా చాలా గ్రౌండెడ్ గా ఉండటం రాజమౌళికి అలవాటు. ఆయనకు పద్మశ్రీ ప్రకటించగానే, చాలా మంది సినీ జనాలు ఆ అవార్డు తీసుకునే అర్హత తనకు లేదని రాజమౌళి భావిస్తున్నాడని, అందుకే తన బదులు వేరెవరినైనా పంపిస్తాడని పుకార్లు వదిలారు. కానీ రాజమౌళి మాత్రం పద్మ అవార్డు స్వయంగా స్వీకరించి వాళ్లందరికీ ఝలక్ ఇచ్చాడు. నిన్న ప్రెసిడెంట్ చేతుల మీదుగా రాజమౌళి పద్మశ్రీని స్వీకరించాడు. ప్రస్తుతం బాహుబలి 2 ను రూపొందించడంలో చాలా బిజీగా ఉన్నాడు దర్శక ధీరుడు. ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసిన నేపథ్యంలో, రెండో సారి ప్రకటించిన తేదీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలని రాజమౌళితో పాటు బాహుబలి టీం అంతా పట్టుదలగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో, రాత్రి సమయంలో యుద్ధాల సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి అండ్ కో. వీటి కోసం 15 ఇండస్ట్రియల్ క్రేన్ లను ఉపయోగిస్తుండటం విశేషం..