ఏకంగా ఐశ్వర్యారాయ్ కే ముద్దు పెట్టేశాడు..!
on Apr 13, 2016

ఐశ్వర్యారాయ్..40 ప్లస్‌లోనూ అదే ఛార్మింగ్, అదే యాక్టింగ్. మనదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఐష్ అందానికి..నటనకి ఫిదా అవుతుంది. ఒకసారి ఆమెను చూస్తే చాలు జన్మ ధన్యం అనే వీరాభిమానులున్నారు. అలాంటి ఐశ్వర్యకి ఎవరూ ఊహించని సంఘటన ఎదురైంది. ప్రజంట్ ఇండియా టూర్‌కి వచ్చిన బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ పాల్గొన్న ఒక కార్యక్రమానికి ఐశ్వర్యకు కూడా ఇన్విటేషన్ అందింది. దీంతో ఆ ప్రోగ్రామ్‌కి వెళ్లిన ఐష్‌కు రెడ్ కార్పెట్‌పై గ్రాండ్‌గా వెలకమ్ చెప్పారు నిర్వాహకులు.
ఆమె రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెళుతూ అందరిని విష్ చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఫోటో జర్నలిస్ట్‌ల్లో నిల్చుని ఉన్న బ్రిటిష్ జర్నలిస్ట్ ఐశ్వర్యకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు. ఐష్ కూడా పలకరింపులో భాగంగా షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈ టైంలో సడెన్ గా ఐశ్వర్య చేతిని జర్నలిస్ట్ ముద్దు పెట్టేసుకున్నాడు. అంతే అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా స్టన్నయ్యారు. అయితే ఏ మాత్రం టెన్షన్ పడని ఐష్ సమయస్పూర్తితో వెంటనే ఒక చిరునవ్వు నవ్వేయడంతో వాతావరణం మామూలైపోయింది. అయితే సదరు జర్నలిస్ట్ ఐశ్వర్యకు ముందే తెలిసి ఉండవచ్చని అందుకే ఆమె కూడా సీరియస్ అవ్వలేదని అక్కడి వారు గుసగుసలాడుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



