జోడి ట్రైలర్: బెట్టింగు... ప్రేమకు ఫిట్టింగు!
on Aug 29, 2019
.jpg)
ధర్మరాజు లాంటోడు జూదంలో రాజ్యాన్ని, భార్యను కోల్పోయాడు. ఒకవేళ ధర్మరాజుకు కుమారుడు ఉంటే... ధర్మరాజు జూదం వల్ల కుమారుడి ప్రేమకు సమస్యలు వస్తే? అనే ఆలోచన నుండి 'జోడీ' కథ పుట్టిందేమో! ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో, అతడి తండ్రిగా సీనియర్ నరేష్ నటించారు. బెట్టింగుకు బానిస అయిన తండ్రిగా అతణ్ణి చూపించారు. ఈ జనరేషన్ కుర్రాడిలా హీరో పాత్ర కనిపిస్తోంది. ఇక, హీరోయిన్ పేరు కాంచనమాల. పేరుకు తగ్గట్టు పాతకాలం మనిషి అని, పాత నోకియా ఫోను వాడుతున్నట్టు హింట్ ఇచ్చారు. ఆ పాత్రలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ చక్కగా నటించింది. ఈ జనరేషన్ కుర్రాడికి, పాతకాలం అమ్మాయికి ప్రేమ కుదిరితే... ఆ ప్రేమకు హీరో తండ్రి బెట్టింగు వ్యసనం ఎలా అడ్డుపడింది అనేది కథ అని ట్రైలర్ చూస్తే సులభంగా అర్థమవుతుంది. కామెడీతో ఈ కథను చెప్పడానికి ప్రయత్నించాడు. ఎమోషన్స్, కామెడీ వర్కవుట్ అయితే ఎప్పటి నుండో సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ నిరీక్షణ ఫలించినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



