'ఆర్డిఎక్స్ లవ్' టీజర్: జిగేల్ జిగేల్ పాయల్ భజే
on Aug 29, 2019
'ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. తప్పదూ అనుకుంటే సేఫ్టీలు అయినా అందుబాటులో ఉంచుకోవాలి' - ఇదీ 'ఆర్డిఎక్స్ లవ్' టీజర్ స్టార్టింగ్ డైలాగ్. ఫీలింగ్స్ కంట్రోల్ లో ఉంచుకోవాలని టీజర్ లో డైలాగ్ అయితే చెప్పించారు గానీ... రొమాన్స్ ని కంట్రోల్ లో చూపించాలనే రూల్స్ ఏవీ దర్శక నిర్మాతలు పెట్టుకోలేదు. పాయల్ రాజ్పుత్ కూడా సెక్సీ ఫీలింగ్స్ ని కంట్రోల్ లో పెట్టుకోకుండా చూపించారు. టీజర్ మొత్తం రొమాన్స్, సెక్స్ చుట్టూ తిరిగింది. డైలాగుల్లో సేఫ్టీ (కండోమ్) పదం ఎక్కువ వినిపించింది.
పైగా, 'అపరిచితులతో మీరు ఎప్పుడైనా సెక్స్ చేశారా?' డైలాగ్ ఒకటి. 'ఆర్ఎక్స్ 100'ను మించి అనేలా పాయల్ రాజ్పుత్ అందాలను చూపించారు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ టీజర్ నచ్చుతుంది. మళ్లీ మళ్లీ చూస్తారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం టీజర్ నచ్చదు. కంటెంట్ కంటే 'జిగేల్ జిగేల్ పాయల్ భజే' అన్నట్టు పాయల్ రాజ్పుత్ అందాలను నమ్ముకుని సినిమా తీసినట్టు ఉంది. మలయాళం బిగ్రేడ్ సినిమా తరహాలో టీజర్ ఉంది.