జీవితంలో అదే కోలుకోలేని దెబ్బ
on Dec 19, 2016
అరవింద్ స్వామి.. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా వారి హృదయాలను దోచుకున్న రోమాంటిక్ స్టార్..వరుస సూపర్‌హిట్లతో దూసుకెళుతోన్న ఈ హీరో జీవితంలో జరిగిన అనుకోని సంఘటనలేంటి..? ఎందుకు మధ్యలో నటనకు దూరమయ్యాడు..తిరిగి విలన్‌గా ఎంట్రీ ఎందుకిచ్చాడు..వాటన్నింటికి సమాధానం ఆయన మాటల్లోనే.
నా తొలి తెలుగు మూవీ ధృవనే:
నేను తెలుగువారికి ఎప్పటి నుంచో పరిచయమై ఉన్నప్పటికి ఇంత వరకు స్ట్రయిట్ తెలుగు మూవీలో నటించలేదు..తెలుగులో నటించమని చాలా ఆఫర్లు వచ్చినప్పటికి కుదర్లేదు. కానీ ధృవ ఆ లోటు తీర్చింది.
భాష నేర్చుకోవాలంటే బద్ధకం:
నాకు తమిళ్, ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు. అందరిలా నేను త్వరగా భాషను నేర్చుకోలేను..ఒక దానిపై ధ్యాస ఉండకపోవడం కూడా అందుకు కారణం
ఒక ప్రమాదం.. జీవితం తలక్రిందులు:
సఖి సినిమా తర్వాత 2006లో కార్ యాక్సిడెంట్ అయ్యింది..వెన్నెముకకి పెద్ద గాయం అయ్యింది..పక్షవాతం వచ్చి సగం శరీరం నా కంట్రోల్ తప్పిపోయింది..ఏడాది పాటు నడవలేకపోయా. మళ్లీ మామూలు మనిషిని కావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో మానసికంగా బలంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఏదో ఒక పనితో బిజీ కావాలనుకున్నా..నటుడిగా మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం అదే.
రియల్ లైఫ్‌లో బిజినెస్ మ్యాన్‌నే:
సినిమా ప్రపంచంలో చిక్కుకోండా..నాకంటూ మరో ప్రపంచం ఉండాలనుకున్నా..అందుకే స్టార్ హీరోగా ఉన్నా మధ్యలో విరామం తీసుకుని వ్యాపారంవైపు దృష్టి పెట్టా. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేశా..ప్రస్తుతం నా దగ్గర 5 వేలమంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది.
విలన్ అలా ఉండకూడదనుకున్నా:
మన సినిమాల్లో విలన్ అంటే గుబురు మీసాలు, కోపం, రక్తపాతం తప్ప మరేం కనిపించదు. కానీ తని ఒరువన్‌లో పాత్ర కోసం మోహన్ రాజా నా దగ్గరకు వచ్చినప్పుడు. విలన్ అంటే ఇలా ఉండకూడదని చెప్పి మార్పులు చేయించా..థియేటర్‌లోంచి బయటకు వెళ్లిన ప్రేక్షకుడు నాపై కోపం..సానుభూతి చూపించాలి.
త్వరలో దర్శకత్వం చేస్తున్నా:
మెగాఫోన్ పట్టుకోవాలని మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే ఈ దిశగా కసరత్తు చేసి రెండు కథల్ని రెడీ చేసుకొన్నా..ఇటీవల వనంగమూడి అనే కథ రాశా. ఒక పోలీసు పాతికేళ్ల జీవితం నేపథ్యంలో సాగే ఈ కథలో నేనే నటిస్తున్నా. దర్శకత్వం వహించినా నటనను వదులుకోను.
కోలీవుడ్‌పైనే నా ఫోకస్:
ధృవతో టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. చాలా మంది బడా నిర్మాతలు నన్ను సంప్రదించారు.కానీ వాటిని సున్నితంగా తిరస్కరించాను. ఎందుకటే ప్రస్తుతానికి నా దృష్టంతా తమిళ సినిమాలపైనే.